Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:16 AM

గ్రహణం నేపథ్యంలో బోరంచ నల్లపోచమ్మ ఆలయం మూసివేత ప్రకటన

02-03-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహక అధికారి శివరుద్రప్ప ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం ఏర్పడనున్న చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకం మరియు అలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు.ఆ సమయం నుంచి గ్రహణం ముగిసే వరకు అమ్మవారికి సంబంధించిన అన్ని పూజా, సేవా కార్యక్రమాలను నిలిపివేస్తామని తెలిపారు.గ్రహణం ముగిసిన తరువాత మరుసటి రోజు బుధవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ఉదయం 8 గంటలకు భక్తులకు పునర్దర్శనం కల్పిస్తారు. ఆ తరువాత సాధారణంగా జరిగే పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.ఈ మార్పులను భక్తులు గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని శివరుద్రప్ప విజ్ఞప్తి చేశారు. గ్రహణం సందర్భంగా ఆలయ ఆచార సంప్రదాయాలను పాటించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Sthanikam

గ్రహణం నేపథ్యంలో బోరంచ నల్లపోచమ్మ ఆలయం మూసివేత ప్రకటన

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News