Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

ఎస్సీ వర్గీకరణ అమరవీరులకు ఘన నివాళులు

ఎస్సీ వర్గీకరణ అమరవీరులకు ఘన నివాళులు

ఎస్సీ వర్గీకరణ అమరవీరులకు ఘన నివాళులు
01-03-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో మాదిగ సంస్మరణ దినోత్సవం

ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల కమిటీ అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడిలుగా వర్గీకరించాలని, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ ఉద్యమం సందర్భంలో ప్రాణాలు అర్పించిన పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడి మృతి చెందిన భారతి మాదిగల త్యాగాలను స్మరించారు.వర్గీకరణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, మాదిగ దండోరా ఉద్యమంలో పాల్గొన్న వేలాది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై నమోదైన కేసులను వెంటనే కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేడి యాదయ్య, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు ఊదర వెంకటేష్ మహజన్, మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు బోయ మల్లేష్, ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు సుక్క అర్జున్ మాదిగ, సామాజిక ఉద్యమకారుడు కట్టెల లింగస్వామి, ఎం.జె.ఎఫ్ మండల అధ్యక్షులు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు చీమకండ్ల శ్రీనివాస్, తాళ్ల సింగారం గ్రామ శాఖ అధ్యక్షులు దొనకొండ కిరణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాజ్ పేరియర్, విహెచ్‌పిఎస్ జిల్లా నాయకులు గడ్డం ప్రభాకర్, బద్రి గాలయ్య, బోయ సృజన్, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఎస్సీ వర్గీకరణ అమరవీరులకు ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News