Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:08 AM

ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం – కార్యకర్తలకు మంత్రి పిలుపు

21-04-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మంగళవారం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వం, పార్టీ కలిసి సమన్వయంతో పనిచేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ నాయకుల మధ్య ఇంకా సమన్వయం అవసరమని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. రాబోయే ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని, వర్గ పోరు పార్టీకి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వేలాది ఉద్యోగాలను భర్తీ చేసి, రైతు బంధు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాల ద్వారా ప్రజలకు సేవలందిస్తోందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు, డిజిటల్ హెల్త్ కార్డుల అమలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్ ఆసుపత్రుల్లో అదనపు పడకలు ఏర్పాటు చేస్తామని, సంగారెడ్డి మెడికల్ కళాశాలలో భవిష్యత్తులో పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదని, ప్రత్యేకంగా బిల్లు తీసుకొస్తే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై చర్చ అవసరమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రూపొందించాలని సూచించారు. నాయకుల మధ్య అంతర్గత పోటీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, సమన్వయం అవసరమని పేర్కొన్నారు. మహిళా బిల్లుపై బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఆ అంశంపై నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ శాతం విజయం సాధించారని తెలిపారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. రైతు బంధు, గృహ పథకాల ద్వారా ప్రజలకు ఉపయోగం జరుగుతోందని, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయమే లక్ష్యమని పేర్కొన్నారు.నీలం మధు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను మరింత బలోపేతం చేసి అన్ని వర్గాల ప్రజలకు చేరేలా కృషి చేయాలని, కుల గణన ఆధారంగా సమాన ప్రాధాన్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతా పాటిల్, పిసిసి ప్రధాన కార్యదర్శులు తోపాజి అనంత్ కిషన్, చిన్నా ముదిరాజ్, నాయకులు శశికళా యాదవ్ రెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ అంజమ్మ సత్యనారాయణతో పాటు పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం – కార్యకర్తలకు మంత్రి పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News