Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:27 AM

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కోహీర్‌లో ట్రాఫిక్ మార్పులు – ప్రజలకు ఎస్సై నరేష్ విజ్ఞప్తి

12-02-2026 183 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల కేంద్రంలో ఉన్న పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్సై నరేష్ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు అనగా శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) కార్యక్రమం నిర్వహించబడనున్నదని ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.ప్రత్యేకంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రూట్‌లో సంచరించే వాహనదారులు ట్రాఫిక్ మార్పులను గమనించి పోలీస్ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో అవసరమైతే వాహనాల రాకపోకలను తాత్కాలికంగా మళ్లించే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు సహనంతో వ్యవహరించి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కోరారు. అనవసర రద్దీని నివారించేందుకు కౌంటింగ్ కేంద్రం వద్దకు అవసరం లేని వ్యక్తులు చేరరాదని హెచ్చరించారు.ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్సై నరేష్ విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారం వల్లే శాంతి భద్రతలు కాపాడబడతాయని, అందరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని, పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం అందించి, ఎన్నికల కౌంటింగ్ కార్యక్రమం విజయవంతంగా ముగిసేలా సహకరించాలి అని కోరుతున్నారు.

Sthanikam

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కోహీర్‌లో ట్రాఫిక్ మార్పులు – ప్రజలకు ఎస్సై నరేష్ విజ్ఞప్తి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News