Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 05:34 PM

ఏలూరు జిల్లాలో అక్రమ రేషన్ దందా మళ్లీ ముదురుతోంది

ఏలూరు జిల్లాలో అక్రమ రేషన్ దందా మళ్లీ ముదురుతోంది

ఏలూరు జిల్లాలో అక్రమ రేషన్ దందా మళ్లీ ముదురుతోంది
March 03, 2026 01:36 AM 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తక్కువ ధరలకు అందాల్సిన ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమంగా మార్కెట్‌కు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లాలోని చింతలపూడి, లింగపాలెం, చాట్రాయి మండలాల్లో అక్రమ రేషన్ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

చాట్రాయి మండలంలోని చిన్నంపేట, మర్లపాలెం, సి.గుడిపాడు గ్రామాల పరిసరాల్లో ప్రతి రోజు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత టిప్పర్లు, టాటా ఏస్ వాహనాల ద్వారా భారీగా రేషన్ బియ్యం తరలింపులు జరుగుతున్నాయంటున్నారు. “మాకు అనుమతులు ఉన్నాయి” అంటూ దళారులు బహిరంగంగానే దందా నడుపుతున్నారని సమాచారం.

ఇక చిన్నచిన్న స్థాయిలో బియ్యం కొనుగోలు చేసి అమ్ముకునే వారికి కూడా ఈ దళారులు బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. “మాకు ఇవ్వకపోతే మీ అంత చూస్తాం” అంటూ కొంతమంది వ్యక్తులు బెదిరిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. చిన్నంపేట ఊరు మధ్యలో గల పెట్రోల్ బంక్ లో చాలా కాలం నుంచి పగటిపూట నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు దర్శనమివ్వడం అంతుచిక్కని ప్రశ్న చిన్నంపేట గ్రామంలో ఒక చికెన్ కొట్టు వ్యాపారి ఈ మాఫియా నడుపుతున్నట్లు సమాచారం పట్టించుకోని అధికారులు

ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యం ఇలా అక్రమ మార్గాల్లో మళ్లించబడుతుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీసు అధికారులు వెంటనే స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ దందాకు అడ్డుకట్ట వేయడానికి అధికారులు ప్రత్యేక దాడులు చేపట్టాలని, రాత్రి వేళల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News