Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న ప్రచారం “నేను ఎవరో మీకు తెలుసా?” ఫ్లెక్సీతో నేరస్థులకు హెచ్చరిక

01-03-2026 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు: నేరాల నియంత్రణలో కొత్తదనం చూపిస్తూ ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. “నేను ఎవరో మీకు తెలుసా?” అంటూ పాత నేరస్థుల ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో కట్టిన ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా శుభాకాంక్షలు, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యే ఫ్లెక్సీలను ఈసారి పోలీసులు ప్రజా భద్రత కోసం వినియోగించడం విశేషం. ఇళ్లలో దొంగతనాలు, బైక్ చోరీలు, గొలుసు దోపిడీలు, ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి వైర్లు దొంగిలించిన కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్థుల ఫోటోలు, పేర్లు, నివాస ప్రాంతాల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

“జర జాగ్రత్త… వీళ్లు మీ చుట్టుపక్కలే ఉండొచ్చు” అనే హెచ్చరికతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ ప్రచారంతో నేరస్థుల్లో భయం కలిగించడంతో పాటు, ప్రజల్లో జాగ్రత్త భావన పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు చెబుతున్నారు.

ఫ్లెక్సీని చూసిన స్థానికులు పోలీసుల ఆలోచనను అభినందిస్తున్నారు. “నేరాలను అరికట్టడంలో ఇది మంచి ముందడుగు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా స్థాయిలో కనిపిస్తున్న ఈ ప్రచారం ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది.

Sthanikam

ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న ప్రచారం “నేను ఎవరో మీకు తెలుసా?” ఫ్లెక్సీతో నేరస్థులకు హెచ్చరిక

Article Image

ఏలూరు: నేరాల నియంత్రణలో కొత్తదనం చూపిస్తూ ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. “నేను ఎవరో మీకు తెలుసా?” అంటూ పాత నేరస్థుల ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో కట్టిన ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా శుభాకాంక్షలు, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యే ఫ్లెక్సీలను ఈసారి పోలీసులు ప్రజా భద్రత కోసం వినియోగించడం విశేషం. ఇళ్లలో దొంగతనాలు, బైక్ చోరీలు, గొలుసు దోపిడీలు, ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి వైర్లు దొంగిలించిన కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్థుల ఫోటోలు, పేర్లు, నివాస ప్రాంతాల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

“జర జాగ్రత్త… వీళ్లు మీ చుట్టుపక్కలే ఉండొచ్చు” అనే హెచ్చరికతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ ప్రచారంతో నేరస్థుల్లో భయం కలిగించడంతో పాటు, ప్రజల్లో జాగ్రత్త భావన పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు చెబుతున్నారు.

ఫ్లెక్సీని చూసిన స్థానికులు పోలీసుల ఆలోచనను అభినందిస్తున్నారు. “నేరాలను అరికట్టడంలో ఇది మంచి ముందడుగు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా స్థాయిలో కనిపిస్తున్న ఈ ప్రచారం ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News