Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:12 AM

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం – పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

25-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షలు ప్రశాంతంగా,సక్రమంగా నిర్వహించబడేలా జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా చర్యలను చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, సెయింట్ ఆంథోని జూనియర్ కళాశాల, ఎస్.వి. జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను స్వయంగా సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, అత్యవసర వైద్య సిబ్బంది సన్నద్ధత, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, కేంద్రాల వద్ద గుంపులుగా చేరడం, అనవసరంగా తిరగడం నిషేధమని స్పష్టం చేశారు.పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతున్నందున, పరీక్షా కేంద్రం నుండి వంద మీటర్ల పరిధిలో ప్రతులు తీసే దుకాణాలు మరియు ఇతర అనుమతి లేని కార్యకలాపాలు నిర్వహించరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.విద్యార్థులు నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా పోలీసు శాఖ తరపున చేయబడ్డాయని, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Sthanikam

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం – పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News