Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలి – జిల్లా పోలీసుల విజ్ఞప్తి

26-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాలు, చెరువుల వద్ద ప్రమాదాలు, దొంగతనాలు పెరిగే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి వాములు, ఎండిన పంట అవశేషాల దగ్గర చిన్న నిర్లక్ష్యం కూడా భారీ అగ్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు పొలాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలని, ఎండిన గడ్డి సమీపంలో మంటలు వేయకూడదని సూచించారు. వంటల అనంతరం పొయ్యిని పూర్తిగా ఆర్పకుండా బయటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. అలాగే వేసవిలో ప్రజలు ఇళ్ల బయట, మేడలపై నిద్రించే సమయంలో దొంగతనాల ప్రమాదం ఉండటంతో ఇళ్ల భద్రతపై శ్రద్ధ వహించాలని కోరారు. చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే నీటిలోకి వెళ్లాలని, లోతు తెలియని ప్రాంతాల్లో ఈతకు దిగకూడదని సూచించారు. మద్యం సేవించి నీటిలోకి వెళ్లడం పూర్తిగా ప్రమాదకరమని హెచ్చరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే 100, 112 లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739కు సమాచారం అందించాలని తెలిపారు. గత వేసవిలో జిల్లాలో 7 అగ్ని ప్రమాదాలు, 50 దొంగతనాలు, 23 చెరువుల ప్రమాదాలు నమోదైనట్లు పేర్కొంటూ, అప్రమత్తతే ప్రాణ రక్షణకు మార్గమని ఎస్పీ తెలిపారు.

Sthanikam

ఎండాకాలంలో జాగ్రత్తలు పాటించాలి – జిల్లా పోలీసుల విజ్ఞప్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News