Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చినకాపర్తిలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

28-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చినకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చినకాపర్తి లో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల బాధ్యతలు, పరిపాలనా వ్యవస్థ, ప్రజాప్రతినిధుల విధులు వంటి అంశాలను స్వయంగా అనుభవిస్తూ అవగాహన పెంపొందించుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సైదా నాయక్ మాట్లాడుతూ, స్వపరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయుల కృషి, క్రమశిక్షణ ప్రాముఖ్యత, పరిపాలనా బాధ్యతల గౌరవాన్ని తెలుసుకుంటారని తెలిపారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అభ్యసించాలని సూచించారు.

ఈ వేడుకలో విద్యార్థులు వివిధ హోదాల్లో వేషధారణలు ధరించి ఆకట్టుకున్నారు. పాఠశాల హెడ్మాస్టర్‌గా అలేఖ్య, ముఖ్యమంత్రిగా నితీష్, గవర్నర్‌గా దీపక్ రెడ్డి, హోం మినిస్టర్‌గా శివ సాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా శ్రీవిద్య, ఫైనాన్స్ మినిస్టర్‌గా వైష్ణవి, ఎమ్మెల్యేలుగా నిహారిక, రేణుక, రేణుకాచారి, ఎంపీగా తేజస్విని, జెడ్పీటీసీగా మహేష్, సర్పంచ్‌గా స్ఫూర్తి, ఎమ్మెల్సీగా రామ్ చరణ్, పీఈటీగా త్రినేత్ర, ఠాగూర్, కళ్యాణ్, గన్‌మెన్‌లుగా అనిల్ కుమార్, నాగరాజు, జగదీష్, డిప్యూటీ సీఎంగా లోహిత్, ఎంపీటీసీగా ప్రణవి, కలెక్టర్‌గా మిన్ను, ఆర్జేడీగా మిష తదితరులు తమ పాత్రలను సమర్థంగా పోషించారు. ఉపాధ్యాయులుగా ప్రత్యూష, మహాలక్ష్మి, నర్మద, వర్షిత, నందిని, అలేఖ్య, కృతిక్ష, విన్నీ, శివ, రేణుక, శివానంద్ మరియు మినిస్టర్లుగా సాయిచరణ్, మహేందర్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిరోజూ ఉపాధ్యాయులు ఎదుర్కొనే అనుభవాలను విద్యార్థులు ఈ రోజు ప్రత్యక్షంగా గ్రహించారని, ఆ అనుభవంవారిలోబాధ్యతాభావాన్ని పెంపొందిస్తుందని అన్నారు.

హెడ్మాస్టర్ వేషం ధరించిన అలేఖ్య మాట్లాడుతూ, పాఠశాల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు ప్రత్యక్షంగా కనిపించాయని, హెడ్మాస్టర్ బాధ్యతలు సులభం కాదని, ఇకపై ఉపాధ్యాయుల సూచనలను గౌరవంతో పాటిస్తామని తెలిపింది.

ఈకార్యక్రమంలోఆంగ్లఉపాధ్యాయులు బాలకృష్ణ, ఫిజిక్స్ ఉపాధ్యాయులు నయీముద్దీన్, గణిత ఉపాధ్యాయులు అసరాపల్లి మరియు శ్రీమతి మాధవి, సోషల్ టీచర్ సాయిబాబా, తెలుగు ఉపాధ్యాయులు చంద్రశేఖర్, హిందీ ఉపాధ్యాయులు శ్రీమతి రేవతి, వాలంటీర్లు శ్రీలత, నవ్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు,క్రమశిక్షణ,బాధ్యతాభావం పెంపొందించే దిశగా స్వపరిపాలన దినోత్సవం ఉత్తమ వేదికగా నిలిచిందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చినకాపర్తిలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News