Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 07:41 PM

ధాన్యం సేకరణలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోండి..

20-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి..

రెండు రకాల ట్రక్ షీట్లతో రైతుల సొమ్ముకు గండి..

పక్క రాష్ట్రాల నుండి ధాన్యం దిగుమతిపై ఆగ్రహం..

నల్లగొండ : జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను అందజేశారు. ఈ సందర్భంగా కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

ట్రక్ షీట్లలో తిమ్మిని బమ్మి చేస్తున్నారు..!

కనగల్ మండలం జి.ఎడవెల్లి ధాన్య సేకరణ కేంద్రంలో రైతులను నిలువునా ముంచుతున్నారని భూపాల్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో రైతులకు ఇచ్చే ట్రక్ షీట్లలో ఒక రకమైన బరువును చూపిస్తున్నారు. అదే ధాన్యానికి సంబంధించి రైస్ మిల్లర్ వద్దకు వెళ్లేసరికి తూకం మార్చి మరో ట్రక్ షీట్ ఇస్తున్నారు. ఈ విధంగా రెండు రకాల ట్రక్ షీట్లను సృష్టిస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని, దీనికి సంబంధించిన పక్కా ఆధారాలను కలెక్టర్‌కు సమర్పించి తక్షణమే విచారణ జరపాలని కోరారు.

యథేచ్ఛగా పక్క రాష్ట్రాల ధాన్యం కొనుగోళ్లు..

తిప్పర్తి మండలంలోని మర్రిగూడెం, తిప్పర్తి, ఇండ్లూరు, మామిడాల తదితర కేంద్రాల్లో స్థానిక రైతుల నుంచి కాకుండా, బయటి రాష్ట్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. స్థానిక నాయకులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై ఈ దందా సాగిస్తున్నారు. మా పార్టీ నాయకులు ఈ అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ స్థానిక అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు

అన్నెపర్తిలో 25 శాతం కొనుగోళ్లు..

​నల్లగొండ మండలం అన్నెపర్తి కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ అత్యంత మందకొడిగా సాగుతోందని కంచర్ల ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్‌ ముగుస్తున్నా అక్కడ ఇంతవరకు కనీసం 25 శాతం కొనుగోళ్లు కూడా పూర్తి కాలేదన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్.. ఈ వ్యవహారాలన్నింటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, అన్నెపర్తి సర్పంచ్ మేక అరవింద్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఎలుక శ్రీనివాస్ రెడ్డి, కోట్ల జైపాల్ రెడ్డి, పెఱిక కరుణ్ జయరాజ్ మరియు ఆయా గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు.

Sthanikam

ధాన్యం సేకరణలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోండి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News