Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:45 AM

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట:దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
May 26, 2026 06:02 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

దివ్యాంగుల సంక్షేమం, వారి ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డితో కలిసి దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు, స్కూటీలు, బ్యాటరీ వీల్‌చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 30 మంది లబ్ధిదారులకు స్కూటీలు, 15 మందికి బ్యాటరీ వీల్‌చైర్లు అందజేశారు.ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దివ్యాంగులు స్వయం సమర్థులుగా జీవించేందుకు అవసరమైన సహాయ ఉపకరణాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులకు కూడా ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.టీజీఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు. ప్రస్తుతం దివ్యాంగులు విద్య, ఉద్యోగాలు, క్రీడలు, కళారంగాల్లో ప్రతిభ కనబరుస్తూ సవ్యాంగులకు దీటుగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను వెలికితీసుకుని సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.జిల్లా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం జిల్లా సంక్షేమ శాఖ ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. వారికి అత్యుత్తమ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు, షఫీ, నర్సింలు, రాయకోటి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News