Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:32 AM

ప్రతి పెన్షన్ దారుడు ఆధార్ అప్డేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి:పులిమామిడి మమత రాజు

26-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ లబ్ధిదారుల ఆధార్ అప్డేషన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు విజయవంతంగా నిర్వహించారు. చేయూత పెన్షన్లు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పీఎంఆర్ గణేష్ మండపంలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, వికలాంగులు, చేనేత కార్మికులు సహా అన్ని వర్గాల పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సులభంగా సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండకుండా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పులిమామిడి మమత మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధి పూర్తిస్థాయిలో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆధార్ అప్డేషన్ కార్యక్రమం జూన్ 2 వరకు కొనసాగుతుందని, ఎవరైనా అప్డేట్ చేసుకోలేకపోతే తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే మళ్లీ వార్డు అధికారులను పిలిపించి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్ పథకాలను ప్రారంభించనున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రజలకు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పులిమామిడి మమత రాజును వార్డు ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు ఆఫీసర్ బోడగామా రజనీకాంత్, చీలం సురేష్, పద్మమాణిక్యం, పరమదాసు, తాలెల్మ రాము, ఫయాజ్, ఫహీం, చోటు, నీలి శ్రీనివాస్, మేకల సంగన్న, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి పెన్షన్ దారుడు ఆధార్ అప్డేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి:పులిమామిడి మమత రాజు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News