Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:17 PM

కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

26-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,

జిల్లాలో ఎక్కడా కల్తీ విత్తనాల విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లాలోని విత్తనాలు, ఎరువుల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సన్న రకాల వరి విత్తనాలను ప్రోత్సహించాలని డీలర్లకు సూచించారు. కల్తీ విత్తనాల విక్రయాలు నిర్వహించినా, వాటిని ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పత్తిలో హెచ్‌డీ కాటన్‌ను ప్రభుత్వం నిషేధించిందని, జిల్లాలో ఎక్కడా విక్రయాలు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.

యూరియా వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని, యాప్ ద్వారా యూరియా బుకింగ్ జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నానో యూరియాను ప్రోత్సహించాలని, రైతులకు అవగాహన కల్పించి సాధారణ యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, విత్తనాలు మరియు ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.

Sthanikam

కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News