Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:28 AM

​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం

26-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ నిబంధనను వెంటనే ఎత్తివేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిర్వహించిన బీసీ ఉద్యోగుల బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ​బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెడతామని ఆయన స్పష్టం చేశారు. మండల్ కమిషన్, నాచియప్పన్ కమిటీలతో పాటు సుప్రీంకోర్టు సైతం ప్రమోషన్లలో రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా, వికలాంగుల రిజర్వేషన్లకు లేని క్రిమిలేయర్ నిబంధన కేవలం బీసీలకే విధించడం వివక్షకు నిదర్శనమన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో అభివృద్ధి పథకాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ​ఈ మహాసభలో విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, ముత్యం వెంకన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, యాదగిరి, రామలింగం, డప్పు స్వామి, కలిమల నరసింహ, ఎడ్ల మహాలింగం, నరేష్ ముదిరాజ్, అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం

Article Image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ నిబంధనను వెంటనే ఎత్తివేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిర్వహించిన బీసీ ఉద్యోగుల బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ​బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెడతామని ఆయన స్పష్టం చేశారు. మండల్ కమిషన్, నాచియప్పన్ కమిటీలతో పాటు సుప్రీంకోర్టు సైతం ప్రమోషన్లలో రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా, వికలాంగుల రిజర్వేషన్లకు లేని క్రిమిలేయర్ నిబంధన కేవలం బీసీలకే విధించడం వివక్షకు నిదర్శనమన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో అభివృద్ధి పథకాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ​ఈ మహాసభలో విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, ముత్యం వెంకన్న, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, యాదగిరి, రామలింగం, డప్పు స్వామి, కలిమల నరసింహ, ఎడ్ల మహాలింగం, నరేష్ ముదిరాజ్, అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News