Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:13 PM

డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్

26-05-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని సూచిస్తూ అశోక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అశోక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి దారితీసింది. అధికార పార్టీ చిన్న విషయంపై అతిగా స్పందించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ అశోక్‌పై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. అశోక్ చెప్పిన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశారని, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి తేల్చిచెప్పారు.

Sthanikam

డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Article Image

జగిత్యాలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ అశోక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని సూచిస్తూ అశోక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అశోక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేయడం వివాదానికి దారితీసింది. అధికార పార్టీ చిన్న విషయంపై అతిగా స్పందించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ అశోక్‌పై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. అశోక్ చెప్పిన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశారని, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని మంత్రి తేల్చిచెప్పారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News