:యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మంగళవారం కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షం రైతు కుటుంబంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన పోషబోయిన ఎర్రయ్యకు చెందిన ఎద్దు పిడుగుపాటుకు మృతి చెందింది.
మంగళవారం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో మెరుపులతో పాటు పిడుగు పడటంతో పొలంలో ఉన్న ఎద్దు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
బ్రతుకుదెరువు కోసం ఇటీవలే కొనుగోలు చేసిన ఎద్దు మృతి చెందడంతో రైతు ఎర్రయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి