Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

ఈదురు గాలులతో వర్షం.. చల్లబడిన వాతావరణం

ఈదురు గాలులతో వర్షం.. చల్లబడిన వాతావరణం

ఈదురు గాలులతో వర్షం.. చల్లబడిన  వాతావరణం
26-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. మధ్యాహ్నం వరకు భానుడు ప్రతాపం చూపించగా, సాయంత్రానికి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై బలమైన గాలులు వీచాయి. అనంతరం పలుచోట్ల మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ప్రజలు మాత్రం ఈ వర్షంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండ వేడితో అల్లాడిపోయిన ప్రజలు చల్లని గాలులతో ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు, వర్షంతో పిల్లలు, యువకులు ఆనందంగా తడుస్తూ సందడి చేశారు. వాతావరణ మార్పుతో పట్టణం, గ్రామాల్లో చల్లని వాతావరణం నెలకొంది.

Sthanikam

ఈదురు గాలులతో వర్షం.. చల్లబడిన వాతావరణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News