Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ

26-05-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బక్రీద్‌ను శాంతి, సేవాభావంతో జరుపుకుందాం – ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దల పిలుపు

బక్రీద్ పండుగను పరస్పర గౌరవం, సేవాభావం, సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోవధకు దూరంగా ఉండాలని సూచిస్తూ సమాజంలో శాంతి, సోదరభావం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

“బక్రీద్ అంటే కేవలం ఖుర్బానీ మాత్రమే కాదు.. పేదలకు సహాయం చేయడం, పంచుకోవడం, మానవత్వాన్ని చాటడం అసలైన సందేశం” అని మత పెద్దలు స్పష్టం చేశారు. గోవధ పేరుతో కొన్ని ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ, మతాల మధ్య చిచ్చుపెట్టే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించారు.

దేశంలో సామరస్య వాతావరణం కొనసాగాలంటే పరస్పర గౌరవ భావన అత్యంత అవసరమని పేర్కొంటూ, “నిజమైన దేశభక్తి అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఇలాంటి వివాదాలకు పూర్తిగా తెరపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలకు యువత దూరంగా ఉండాలని సూచించిన మత పెద్దలు, బక్రీద్ పండుగను ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు, పేదలకు ఆహార పంపిణీతో శాంతియుతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చెందిన మౌలానా అత్తర్ సాబ్, హఫీజ్ ఖలీల్, మౌలానా మగ్దమ్ సాబ్, ముఫ్తీ సిద్ధిక్ అహ్మద్ షా సహాబ్ సంయుక్తంగా కీలక ప్రకటన విడుదల చేశారు.

Sthanikam

ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News