Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:55 PM

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి

26-05-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* జలాల్‌పూర్‌లో ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సు

* కిశోర బాలికలకు ‘స్నేహ సమ్మర్ క్యాంప్’లో అవగాహన

బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, 18 సంవత్సరాల లోపు పిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని జలాల్‌పూర్ గ్రామ సర్పంచ్ శాపాక లింగస్వామి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ గ్రామ పంచాయితీ ఆవరణలో మంగళవారం "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బాల్యవివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాల్యవివాహాల వల్ల బాలికల భవిష్యత్తు, ఆరోగ్యం దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతుందని తెలిసినా.. లేదా ఆ వివాహాన్ని ప్రోత్సహించినా, సహాయం చేసినా చట్టప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. వివాహం జరిపించే పురోహితుడికి, పెళ్ళికొడుకుకి, వారి తల్లిదండ్రులకు, అలాగే వారికి తోడుగా నిలిచే బంధువులకు కూడా ఈ శిక్ష వర్తిస్తుందని తల్లిదండ్రులకు, కిశోర బాలికలకు వారు క్షుణ్ణంగా వివరించారు.

కిశోర బాలికల ఆరోగ్యంపై ‘స్నేహ సమ్మర్ క్యాంప్’..

ఇదే వేదికపై నిర్వహించిన "స్నేహ సమ్మర్ క్యాంప్"లో బాలికల ఆరోగ్యంపై నిపుణులు అవగాహన కల్పించారు. ఏపీఎం, సీసీ మల్లేశం, వీబీకే రజిత పాల్గొని బాలికల్లో రక్తహీనత (అనీమియా) నివారణ, శరీరంలో హిమోగ్లోబిన్ శాతం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకు సవివరంగా తెలియజేశారు.

ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కేసారం మధుసూధన్ రెడ్డి, వార్డు సభ్యులు, సీహెచ్. మంగ, ఎస్. పద్మ, వీఓ కృష్ణవేణి, సంధ్య, అమృత, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, కిశోర బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News