Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 08:46 PM

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు..

21-05-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఐకేపీ కేంద్రం, చిలకమర్రి గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ..

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి..

మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు..

పి.ఏ.పల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చిలకమర్రిలోని ధాన్యం నిల్వ గోడౌన్‌ను వారు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తూకం విధానం, నిల్వ సామర్థ్యం, రవాణా సౌకర్యాలతో పాటు రైతులకు కల్పిస్తున్న కనీస వసతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.

పారదర్శకంగా కొనుగోళ్లు వేగంగా చెల్లింపులు..

ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాలని, రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను ప్రభుత్వం వేగవంతంగా రైతు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్రాలకు వచ్చే రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి. నేరుగా రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. రైతులు ఎవరూ మధ్యవర్తులను, దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, నేరుగా ప్రభుత్వ కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు నుండి మిల్లింగ్ ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, సమయపాలన పాటించాలన్నారు.

ఎండ తీవ్రత దృష్ట్యా వసతుల కల్పన..

​ప్రస్తుతం వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. కేంద్రాల వద్ద​చల్లని తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలి. రైతులు వేచి ఉండేందుకు కూర్చునే సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అత్యవసర వైద్యం కోసం ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) కిట్లను అందుబాటులో ఉంచాలి. ​రైతుల ప్రయోజనాలే పరమావధిగా యంత్రాంగం పనిచేయాలని, ముందస్తు ప్రణాళికతో ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ నవీన్, ఎస్ఐ నరసింహలతో పాటు వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, ఐకేపీ ప్రతినిధులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News