Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:00 AM

భక్తిశ్రద్ధలతో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి నిర్వహణ

26-04-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కేంద్రం సంగారెడ్డిలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వాసవి మహా సంస్థాన్ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్, కలెక్టరేట్, పాత బస్టాండ్ మీదుగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా “జై వాసవి.. జై జై వాసవి” నినాదాలతో ప్రాంతం మార్మోగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. తరువాత అమ్మవారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించారు. తహసీల్దార్ జైరాం నాయక్, కలెక్టరేట్ అధికారులు పాల్గొని వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఆర్యవైశ్య మహిళలు, సంఘం నాయకులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News