Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:17 AM

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సేవ – తూమ్నూర్ గ్రామ భక్తుల నుంచి ఆలయానికి రూ.65 వేల హుండీ బహుకరణ

08-03-2026 180 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం భక్తులకు విశేష ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ప్రతి ఆదివారం ఈ ఆలయానికి పరిసర గ్రామాల నుండి అనేక మంది భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.ఈ క్రమంలో ఆదివారం మానూర్ మండలంలోని తూమ్నూర్ గ్రామానికి చెందిన మంగలి నారాయణ, మంగలి యాదగిరి, మంగలి మహేష్ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు తమ భక్తిని చాటుకుంటూ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయానికి సుమారు రూ.65,000 విలువైన హుండీని భక్తి పూర్వకంగా బహుకరించారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు యువత యువకులు మంగలి నారాయణ, మంగలి యాదగిరి, మంగలి మహేష్‌ల సేవాభావాన్ని ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారి భక్తి మరియు సేవా కార్యక్రమాలు ఇతర భక్తులకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.ఈ విధంగా భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించడం ద్వారా అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని గ్రామస్తులు కోరుకున్నారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సేవ – తూమ్నూర్ గ్రామ భక్తుల నుంచి ఆలయానికి రూ.65 వేల హుండీ బహుకరణ

Article Image

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం భక్తులకు విశేష ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ప్రతి ఆదివారం ఈ ఆలయానికి పరిసర గ్రామాల నుండి అనేక మంది భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.ఈ క్రమంలో ఆదివారం మానూర్ మండలంలోని తూమ్నూర్ గ్రామానికి చెందిన మంగలి నారాయణ, మంగలి యాదగిరి, మంగలి మహేష్ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారు తమ భక్తిని చాటుకుంటూ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయానికి సుమారు రూ.65,000 విలువైన హుండీని భక్తి పూర్వకంగా బహుకరించారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు యువత యువకులు మంగలి నారాయణ, మంగలి యాదగిరి, మంగలి మహేష్‌ల సేవాభావాన్ని ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారి భక్తి మరియు సేవా కార్యక్రమాలు ఇతర భక్తులకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.ఈ విధంగా భక్తులు ఆలయ అభివృద్ధికి సహకరించడం ద్వారా అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని గ్రామస్తులు కోరుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News