Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:02 AM

దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు అభినందనీయం

18-03-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాకు చెందిన హ్యూమన్ రైట్స్, సామాజిక న్యాయం, సమాజ సేవ ద్వారా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్, మార్షల్ ఆర్ట్స్ స్వీయ రక్షణ కరాటే జాతీయ చైర్మన్ తాల్వర్ సుమన్‌తో హృదయపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలపై చర్చించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజల్లో హక్కులపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా మహిళల హక్కులు, బాలల హక్కులు, వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులు మరియు ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సమాజంలో వ్యసనాల వల్ల కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాల వ్యతిరేకంగా కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేపడుతున్నామని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని తెలిపారు. యువత సక్రమ మార్గంలో నడవడానికి, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దేశగాని అశోక్ కుమార్, వరంగల్ జిల్లా పాషా, మహబూబాబాద్ జిల్లా రామరాజు, సాయి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అనీలు, కోఆర్డినేటర్ మదు, చిగురుమామిడి లింగమూర్తి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు అభినందనీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News