డయల్-100 కాల్‌తో క్షణాల్లో స్పందన.. ఉరికి వేలాడుతున్న వ్యక్తికి ప్రాణం పోసిన హెడ్ కానిస్టేబుల్
డయల్-100 కాల్‌తో క్షణాల్లో స్పందన.. ఉరికి వేలాడుతున్న వ్యక్తికి ప్రాణం పోసిన హెడ్ కానిస్టేబుల్
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా, చండూరు:
డయల్-100కు వచ్చిన అత్యవసర కాల్‌పై కేవలం ఐదు నిమిషాల్లో స్పందించిన చండూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉరివేసుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడారు.ఉడతలపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోందని డయల్-100 ద్వారా సమాచారం అందడంతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిశీలించగా ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన శ్రీనివాస్ ఆలస్యం చేయకుండా ఇంటి ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. వెంటనే ఉరిని తొలగించి బాధితుడికి సీపీఆర్ (CPR) అందించి, అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయన సమయానుకూల చర్యలతో బాధితుడి ప్రాణాలు దక్కాయి.హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ చూపిన అప్రమత్తత, ధైర్యసాహసాలు, విధి పట్ల నిబద్ధతను స్థానిక ప్రజలతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి