Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:12 AM

దత్తగిరి మహారాజ్ వార్షిక పాదయాత్ర బెల్లాపూర్ నుండి వైభవంగా ప్రారంభం

27-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

లోక కళ్యాణం కోసం జన్మించిన సత్పురుషులు, జగద్గురువులు, మహాయోగి, దత్తగిరి ఆశ్రమ వ్యవస్థాపకులు దత్తగిరి మహారాజ్ వార్షిక ఉత్సవం 47వ అమర తిథి సందర్భంగా నిర్వహించే 37వ పాదయాత్ర (రథయాత్ర) వైభవంగా ప్రారంభమైంది. ఆయన జన్మస్థలమైన మానూర్ మండలం పరిధిలో బెల్లాపూర్ గ్రామం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది.గురువారం రాత్రి 9:45 గంటలకు బెల్లాపూర్ ఆశ్రమంలో గణపతి పూజ, దత్తాత్రేయ స్వామి పాదపూజ, రుద్రాభిషేకం, మహా మంగళహారతి, భజన సంకీర్తనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. భక్తులు ఆలయ వాతావరణాన్ని ఆరాధనతో నింపారు.శుక్రవారం ఉదయం 6:23 గంటలకు బెల్లాపూర్ ఆశ్రమం నుండి రథయాత్ర పల్లకి సేవ బయలుదేరి మనూర్, పిప్రి గ్రామాల మీదుగా నారాయణఖేడ్ పట్టణానికి చేరుకుంది. పీఠాధిపతి మహామండలేశ్వర్ సిద్ధి పురుషులు 1008 సిద్ధేశ్వరానంద గిరి మహారాజ్ ఆధ్వర్యంలో గిరి బృందం గ్రామాల్లో ఘన స్వాగతం పొందింది. మహిళలు, చిన్నారులు కలశాలతో స్వాగతం పలికారు.బెల్లాపూర్ గ్రామంలో మహిళలు నిర్వహించిన సంగీత కోలాటాలు, భజన సంకీర్తనలు పాదయాత్రలోని భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పూజ్య నందినీ గిరి మాత, దేవగిరి మహారాజ్, విశ్వానందగిరి మహారాజ్ నేతృత్వంలో పాదయాత్ర కొనసాగుతోంది. సంగారెడ్డి, పి. విఠల్ రెడ్డి, బుచ్చిరెడ్డి, నర్సిరెడ్డి, నాగిరెడ్డి, శామన్న, శివరాం తదితరులు భజన సంకీర్తనలను నిర్వహించారు.ఈ పాదయాత్ర ద్వారా గ్రామాల ప్రజల్లో ఆధ్యాత్మిక పునరుజ్జీవనం, భక్తి భావం పెరుగుతుంది, దత్తగిరి మహారాజ్ కృషి, ఉద్దీపనతో ఆధ్యాత్మిక వైభవం ప్రతిబింబిస్తోంది. భక్తులు, యువత, మహిళలు, చిన్నారులు ప్రతి దశలో స్ఫూర్తితో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

దత్తగిరి మహారాజ్ వార్షిక పాదయాత్ర బెల్లాపూర్ నుండి వైభవంగా ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News