Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:16 AM

దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్

06-03-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడేందుకు, పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో కీలకమని జడ్.పి.హెచ్.ఎస్ నారాయణఖేడ్ ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్ తెలిపారు.సమాజంలో ఉన్న దాతలు,పూర్వ విద్యార్థులు మరియు సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందించడం నిజంగా అభినందనీయమని ఆయన అన్నారు.శుక్రవారం నాడు చంద్రశేఖర్ ఆచార్య మిత్రులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సహకారంతో సుమారు రూ.10,000 విలువ గల ఇన్సులేటర్ పరికరాన్ని పాఠశాలకు అందజేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో దాతల సహకారంతో పాఠశాలలో చదువుతున్న సుమారు 900 మంది విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, విద్యా సామాగ్రి, ఆంగ్ల నిఘంటువులు, క్రీడా సామగ్రి, క్రీడా దుస్తులు వంటి అనేక అవసరమైన సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పీఎం శ్రీ పథకం ద్వారా విద్యార్థులకు వివిధ ప్రాంతాలకు విజ్ఞాన విహారయాత్రలు నిర్వహించడం ద్వారా వారికి ప్రాయోగిక జ్ఞానం అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థుల విజ్ఞానం మరియు అవగాహన పెంపొందించేందుకు పరిశ్రమలు, సంస్థలను సందర్శించే ఇండస్ట్రియల్ విజిట్లను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విద్యార్థులు హైదరాబాద్ నగరంలో ఉన్న అనూస్ బ్యూటిషియన్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు భవిష్యత్తు అవకాశాలపై అవగాహన పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్, దన్సింగ్, చరణ్ సింగ్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News