Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 02:03 PM

డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన – ప్రమాదాల తగ్గింపే లక్ష్యం

డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన – ప్రమాదాల తగ్గింపే లక్ష్యం

డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన – ప్రమాదాల తగ్గింపే లక్ష్యం
April 10, 2026 07:31 PM 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు “అరైవ్ అలైవ్” పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏప్రిల్ 13 నుంచి 18 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమాలపై జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో సర్పంచ్‌లు, యువకులతో గ్రామ స్థాయి రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి, గ్రామాల్లో ఉన్న రోడ్డు సమస్యలను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించడం, రోడ్డు ప్రమాదాల దృశ్యాలను ఎల్ఈడి స్క్రీన్లు, ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు చూపించడం, గోడలపై వాల్ పెయింటింగ్‌లు వేయించడం, పోలీసు కళా బృందాల ద్వారా నాటికలు ప్రదర్శించడం ద్వారా అవగాహన పెంచాలని తెలిపారు. పోలీసులే ముందుగా ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై కూడా చలానాలు విధించాలని ఆదేశించారు. ఆటో, లారీ, బస్సు డ్రైవర్ల సంఘాలతో సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్ నియమాలపై చర్చించాలని, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్, లౌడ్‌స్పీకర్లు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థలు చురుకుగా పాల్గొని ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఎస్పీ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News