Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:08 PM

చౌటుప్పల్‌లో ల్యాబ్‌లో భారీ పేలుడు

చౌటుప్పల్‌లో ల్యాబ్‌లో భారీ పేలుడు

చౌటుప్పల్‌లో ల్యాబ్‌లో భారీ పేలుడు
13-02-2026 393 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దోతి గూడెం వద్ద గల బృందావన్ ల్యాబ్ లో భారీ పేలుడు సంభవించింది.

ల్యాబ్‌లో ఉన్న రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భయాందోళన నెలకొంది. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తంగా బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.

పేలుడు తీవ్రతతో ఒక బ్లాక్ పూర్తిగా దగ్ధమైంది. కంపెనీ ప్రాంగణంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రెవిన్యూ, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

Sthanikam

చౌటుప్పల్‌లో ల్యాబ్‌లో భారీ పేలుడు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News