Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

చిత్తపూరు–బూరుగుగూడెం ప్రధాన రహదారికి నూతన రూపు

01-03-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఎన్నో సంవత్సరాలుగా అధ్వానంగా మారి అభివృద్ధికి నోచుకోని చిత్తపూరు నుంచి బూరుగుగూడెం వరకు ఉన్న ప్రధాన రహదారికి శాశ్వత పరిష్కారం లభించిందని, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి సహకారంతో రూ. 3 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రహదారి నిర్మాణం పూర్తి చేయబడుతుందని,

ప్రతిరోజూ భారీగా ప్రజల రాకపోకలు సాగుతున్న ఈ రహదారి గతంలో గుంతలతో నిండిపోవడంతో పాటు దుమ్ము, వర్షాకాలంలో మురికి నీరు నిల్వతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు ప్రయాణంలో అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని,

ప్రజల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయించిందని, దీంతో చాట్రాయి గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన, భద్రమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చిందని

ఆరుగొలనుపేట జనార్ధవరం గ్రామం నుంచి బూరుగుగూడెం వరకు అభివృద్ధి దిశగా ఇది ఒక ముఖ్యమైన ఘట్టమని, మండలానికి ఇది ముందడుగని, దగ్గర వుండి పనులను పరిశీలిస్తూ నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నట్లు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు తెలిపారు.

రహదారి నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య, వ్యవసాయ కార్యకలాపాలు మరింత వేగవంతమవుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

చిత్తపూరు–బూరుగుగూడెం ప్రధాన రహదారికి నూతన రూపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News