Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

చిట్యాల మున్సిపాలిటీలో 8వ వార్డ్ పర్యటన సమస్యల పరిష్కారానికి హామీ

28-02-2026 227 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో శనివారం మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ స్థానిక సమస్యలను వివరించారు.

వార్డులో డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, రహదారుల దుస్థితి, వీధి దీపాల సమస్యలు, తాగునీటి సరఫరా అంతరాయాలు వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను కూడా చైర్మన్, వైస్ చైర్మన్ స్వయంగా వినిపించుకున్నారు.ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత రమేష్ మాట్లాడుతూ, వార్డులో ఉన్న ప్రాధాన్య సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన నిధులను మంజూరు చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు కూడా ప్రజలకు భరోసా ఇచ్చి, అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఎర్పుల పరమేష్, బొబ్బలి సందీప రాంరెడ్డి, నాయకులు గాలి లింగయ్య, దేశాపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలో 8వ వార్డ్ పర్యటన సమస్యల పరిష్కారానికి హామీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News