Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:36 AM

చిట్యాల మున్సిపాలిటీలొ బిఆర్ఎస్ కు పెరుగుతున్న ఆదరణ

01-02-2026 142 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మున్సిపల్ ఎన్నికలకు ముందు యువత చేరికతో బలపడుతున్న బిఆర్ఎస్

మునిసిపల్ ఏన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అభివృద్ధి, భవిష్యత్ అవకాశాలే లక్ష్యంగా చదువుకున్న యువత రాజకీయాల్లో తమ వైఖరిని స్పష్టంగా ప్రకటిస్తోంది. ఈ క్రమంలో యువత పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.చిట్యాల మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన మారగోని తేజస్విని బిఆర్ఎస్ పార్టీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి ప్రస్తుతం వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తేజస్విని, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చిరుమర్తి లింగయ్య సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని బిఆర్ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు పదేళ్ల పాలనలో విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల ద్వారా యువతకు భరోసా కల్పించిన పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. మాటలకే పరిమితమైన రాజకీయాలు కాకుండా, పనితీరుతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న పార్టీగా బిఆర్ఎస్ నిలిచిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా తీర్చిదిద్దిన ఘనత బిఆర్ఎస్‌కే దక్కిందని తెలిపారు.

తేజస్విని మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, యువతకు అవకాశాలు కల్పించిన పార్టీని ఎంచుకోవాలన్న స్పష్టమైన ఆలోచనతోనే బిఆర్ఎస్‌లో చేరినట్లు చెప్పారు. తెలంగాణను దేశమంతా గర్వపడేలా నిలబెట్టిన కేసీఆర్ నాయకత్వం తనను ఆకర్షించిందని వెల్లడించారు.

చదువుకున్న యువత బిఆర్ఎస్ వైపు రావడం పార్టీ విధానాలకు లభిస్తున్న ప్రజా మద్దతుకు నిదర్శనమని చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. చిట్యాల మున్సిపాలిటీలో గత బిఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి బాటలు వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలు, అమలుకాని గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో బిఆర్ఎస్‌పై ప్రజలు, యువత చూపుతున్న విశ్వాసమే రాబోయే ఎన్నికల్లో తమకు వెయ్యి ఏనుగుల బలంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీలొ బిఆర్ఎస్ కు పెరుగుతున్న ఆదరణ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News