Sthanikam - Truth Matters
Logo

చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డులో అభ్యర్థికి మద్దతుగా చిరుమర్తి లింగయ్య ప్రచారం

Updated : 05 Feb 2026 13:25 IST
As Preferred Source 1 min read
 చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డులో అభ్యర్థికి మద్దతుగా చిరుమర్తి లింగయ్య ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆగు అశోక్ యాదవ్‌కు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలుసుకుని, బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరిన ఆయన, గతంలో పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. చిట్యాల పట్టణ అభివృద్ధికి ఆగు అశోక్ యాదవ్ అనుభవం, సేవాభావంఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డులో అభ్యర్థికి మద్దతుగా చిరుమర్తి లింగయ్య ప్రచారం

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆగు అశోక్ యాదవ్‌కు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలుసుకుని, బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరిన ఆయన, గతంలో పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. చిట్యాల పట్టణ అభివృద్ధికి ఆగు అశోక్ యాదవ్ అనుభవం, సేవాభావంఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news