Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

చిట్యాల మున్సిపాలిటీ ఏడో వార్డులో వాటర్ ప్లాంట్ అక్రమ తొలగింపు పునరుద్ధరణకు వినతి

28-02-2026 329 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ ఏడో వార్డులో ఉన్న కమ్యూనిటీ హాల్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు తాగునీరు అందిస్తున్న వాటర్ ప్లాంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి అక్రమంగా తొలగించిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఉదయం విషయం వెలుగులోకి రావడంతో వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై స్పందించిన చిట్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ప్లాంట్‌ను అక్రమంగా తొలగించడం బాధాకరమని పేర్కొంటూ, వెంటనే చర్యలు తీసుకుని అదే స్థలంలో తిరిగి పునరుద్ధరించాలని కోరారు.

వాటర్ ప్లాంట్‌కు సంబంధించిన సామాగ్రిని మున్సిపల్ కార్మికులు తీసుకువచ్చినట్లు తెలిపారు. వాటిని తిరిగి అమర్చి ప్రజలకు మళ్లీ సేవలు అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ పార్టీ వార్డు ఇన్చార్జిలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వార్డు ప్రజలు కూడా ప్లాంట్ పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ ఏడో వార్డులో వాటర్ ప్లాంట్ అక్రమ తొలగింపు పునరుద్ధరణకు వినతి

Article Image

చిట్యాల మున్సిపాలిటీ ఏడో వార్డులో ఉన్న కమ్యూనిటీ హాల్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు తాగునీరు అందిస్తున్న వాటర్ ప్లాంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి అక్రమంగా తొలగించిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఉదయం విషయం వెలుగులోకి రావడంతో వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై స్పందించిన చిట్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ప్లాంట్‌ను అక్రమంగా తొలగించడం బాధాకరమని పేర్కొంటూ, వెంటనే చర్యలు తీసుకుని అదే స్థలంలో తిరిగి పునరుద్ధరించాలని కోరారు.

వాటర్ ప్లాంట్‌కు సంబంధించిన సామాగ్రిని మున్సిపల్ కార్మికులు తీసుకువచ్చినట్లు తెలిపారు. వాటిని తిరిగి అమర్చి ప్రజలకు మళ్లీ సేవలు అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ పార్టీ వార్డు ఇన్చార్జిలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వార్డు ప్రజలు కూడా ప్లాంట్ పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News