Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

చిట్యాల మండలంలో నలుగురు విద్యార్థులకు జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్

27-02-2026 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విద్యా రంగానికి గర్వకారణమైన విజయ ఘట్టం నమోదైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ మేఅంస్ కమ్మె రిట్స్కా లర్షిప్ స్కీం (NMMS) పరీక్షలో మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభ చాటుతూ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.గత సంవత్సరం నవంబర్‌లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పరీక్షలో వనిపాకల, ఎలికట్టే గ్రామాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎలికట్టే గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పి. హారిక, ఎస్. కావ్య శ్రీలు మెరిట్ సాధించగా, వనిపాకల గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పి. సంజన, ఎం. సిరి కూడా స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.ఈ స్కాలర్‌షిప్ ద్వారా విద్యార్థులకు ఇంటర్మీడియట్ పూర్తి అయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది గొప్ప ప్రోత్సాహంగా నిలుస్తోంది.

విద్యార్థుల విజయంపై వనిపాకల ప్రధానోపాధ్యాయులు శ్రీనయ్య చారి, ఎలికట్టేప్రధానోపాధ్యాయులు నరసింహ అభినందనలు తెలిపారు. క్రమశిక్షణతో చదువుతూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.అభినందన కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతలను సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థులు చిట్యాల మండలానికి కీర్తి తెచ్చారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

చిట్యాల మండలంలో నలుగురు విద్యార్థులకు జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News