Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

చిట్యాల మండలంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా స్వపరిపాలన దినోత్సవం వైభవంగా

02-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు,బాధ్యతాభావాన్ని అలవరచేందుకు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

మండలంలోని ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉరుమడ్ల, ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వనిపాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులను నిర్వహించారు. పాఠ్యాంశాలను సమగ్రంగా బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో పాఠాలు బోధించడం విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, స్వపరిపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉన్నత ఆశయాలను నిర్దేశించుకుని కృషి చేస్తే లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. ఈ రోజు చేపట్టిన పదవులను భవిష్యత్తులో నిజ జీవితంలోనూ అలంకరించేలా శ్రమించాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని వివరించారు.కార్యక్రమంలో ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్ధన్, ప్రధానోపాధ్యాయులు ఆర్. వెంకన్న, ఏపూర్ జడ్‌పి హెచ్‌ఎస్ హెచ్‌ఎం పాలెం పరమేష్, ఉరుమడ్ల జడ్‌పి హెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు బోధనం మోహన్ రెడ్డి, వనిపాకల జడ్‌పి హెచ్‌ఎస్ హెచ్‌ఎం శ్రీను ఆచారి, దంతూరి సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

చిట్యాల మండలంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా స్వపరిపాలన దినోత్సవం వైభవంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News