Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:09 PM

చిట్యాల 9వ వార్డులోత్రాగునీటి సమస్యకు చెక్

02-03-2026 387 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెంకటేశ్వర హిల్ కాలనీ వాటర్ ప్లాంట్ మరమ్మత్తులతో మళ్లీ ప్రజలకు సేవలు

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు వెంకటేశ్వర హిల్ కాలనీలో నెలలుగా నిలిచిపోయిన వాటర్ ప్లాంట్‌కు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ప్లాంట్ పనితీరు దెబ్బతినడంతో కాలనీ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చింది.

ఈ కార్యక్రమంలో పందిరి గీతా రమేష్ ప్రత్యేకంగా చొరవ చూపి అధికారులతో సమన్వయం చేసి పనులను వేగవంతం చేశారు. అలాగే 9వ వార్డు కౌన్సిలర్ ఎర్పుల పరమేష్ స్థానికంగా పర్యవేక్షణ చేస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయించడంలో కీలక పాత్ర పోషించారు.సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాటి మాధవరెడ్డి కూడా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. వారి సమిష్టి కృషితో ప్లాంట్ మరమ్మత్తులు పూర్తి కావడంతో కాలనీ ప్రజలు ఉపశమనం పొందారు.

కాలనీ వాసులు ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలపై త్వరితగతిన స్పందించాలని కోరుతున్నారు. నీటి సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగేందుకు మున్సిపల్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

చిట్యాల 9వ వార్డులోత్రాగునీటి సమస్యకు చెక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News