Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

చిట్యాల 7వ వార్డుకు ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ నెరవేర్పు

28-02-2026 341 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల హామీని నిలబెట్టిన వేముల వీరేశం మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డులో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయించారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన దేశపాక లత రాజేష్ పదవీ బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల లోపే ఈ ప్లాంట్ ఏర్పాటు పూర్తిచేయడం విశేషం. ఎమ్మెల్యే సూచనలు, కౌన్సిలర్ చొరవతో ఈ కార్యక్రమం వేగవంతంగాఅమలైంది.ప్రాంతంలో స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు ఉచితంగా శుద్ధి చేసిన త్రాగునీరు అందుబాటులోకి రావడంతో 7వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ సదుపాయం వల్ల ఉపశమనం కలిగిందని తెలిపారు.

ప్రజా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కారం చూపడంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ముందుంటారని స్థానికులుఅభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.

Sthanikam

చిట్యాల 7వ వార్డుకు ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ నెరవేర్పు

Article Image

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల హామీని నిలబెట్టిన వేముల వీరేశం మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డులో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయించారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన దేశపాక లత రాజేష్ పదవీ బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల లోపే ఈ ప్లాంట్ ఏర్పాటు పూర్తిచేయడం విశేషం. ఎమ్మెల్యే సూచనలు, కౌన్సిలర్ చొరవతో ఈ కార్యక్రమం వేగవంతంగాఅమలైంది.ప్రాంతంలో స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు ఉచితంగా శుద్ధి చేసిన త్రాగునీరు అందుబాటులోకి రావడంతో 7వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ సదుపాయం వల్ల ఉపశమనం కలిగిందని తెలిపారు.

ప్రజా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కారం చూపడంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ముందుంటారని స్థానికులుఅభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News