Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:12 PM

చిన్నారి హత్య కేసులో నిందితుల అరెస్టు చేయాలి డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్

28-02-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగర్ కర్నూలు: కుమ్మెర గ్రామంలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అగ్రకుల అహంకారానికి బలైన రెండు నెలల పసిపాపకు న్యాయం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. శనివారం క్లాక్‌టవర్ సెంటర్‌లో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మల్లన్న జాతరకు వెళ్లిన బాధిత మహిళను తక్కువ కులానికి చెందినదని అవమానిస్తూ దర్శనానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి చేసి, పసిపాపను తన్నడంతో మృతి చెందిందని ఆరోపించారు.

ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, నాయకులు రఘువరన్, మేడి కిరణ్, భూక్యా రాథోడ్ నాయక్, యాదగిరి, శివ, మాదాసు శ్రావణ్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నారి హత్య కేసులో నిందితుల అరెస్టు చేయాలి డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్

Article Image

నాగర్ కర్నూలు: కుమ్మెర గ్రామంలో జరిగిన చిన్నారి హత్య ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అగ్రకుల అహంకారానికి బలైన రెండు నెలల పసిపాపకు న్యాయం చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. శనివారం క్లాక్‌టవర్ సెంటర్‌లో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కులవివక్ష ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మల్లన్న జాతరకు వెళ్లిన బాధిత మహిళను తక్కువ కులానికి చెందినదని అవమానిస్తూ దర్శనానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించిన కుటుంబ సభ్యులపై దాడి చేసి, పసిపాపను తన్నడంతో మృతి చెందిందని ఆరోపించారు.

ఘటనకు బాధ్యులైన ఎనిమిది మందిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, నాయకులు రఘువరన్, మేడి కిరణ్, భూక్యా రాథోడ్ నాయక్, యాదగిరి, శివ, మాదాసు శ్రావణ్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News