Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:07 AM

చప్తా గ్రామంలో విద్యాభివృద్ధికి మరో ముందడుగు

14-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలం చప్తా (కే) గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ హై స్కూల్‌లో మహాత్మా జ్యోతి సర్వోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన లైబ్రరీని ఏర్పాటు చేసి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమహారతి, ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ హాజరై లైబ్రరీ గదిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ మెత్రి సునీతమ్మ, మాజీ సర్పంచ్ గంగయ్యస్వామి, ఉపసర్పంచ్ బస్వారాజ్, వార్డ్ సభ్యులు నందు, లక్ష్మి సాయిగొండ తదితరులు అతిథులను ఘనంగా స్వాగతించారు.ఈ సందర్భంగా చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ, గ్రామ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. అలాగే మహాత్మా జ్యోతి సర్వోదయ ఫౌండేషన్ చైర్మన్ సుధాకర్ చేసిన సేవలను కొనియాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ లైబ్రరీ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు చదివే అవకాశం పెరిగి, వారి జ్ఞానం విస్తరించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

చప్తా గ్రామంలో విద్యాభివృద్ధికి మరో ముందడుగు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News