Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:08 AM

బోరంచలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు… యువతతో ప్రతిజ్ఞ

13-03-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ సీఐ రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యువతకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి పెద్ద ముప్పుగా మారుతోందని అన్నారు. ముఖ్యంగా యువత మత్తుకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు నేరాలకు కూడా పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.డ్రగ్స్ లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ముఖ్యంగా యువత ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా రవాణా జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామ స్థాయిలో అవగాహన పెంచితేనే మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని చెప్పారు.అనంతరం గ్రామస్థులు, యువతతో కలిసి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుని సమాజ అభివృద్ధికి యువత తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరీమ్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత యువకులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు… యువతతో ప్రతిజ్ఞ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News