Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 15, 2026 11:04 PM

బోరంచ జాతరపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

బోరంచ జాతరపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

బోరంచ జాతరపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
April 15, 2026 07:18 PM 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన బోరంచ గ్రామంలో వెలసిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి 7 వారాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 నుండి జూన్ 4 వరకు జరుగనున్న ఈ జాతర ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.అనంతరం మాట్లాడుతూ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు త్రాగునీటి కొరత లేకుండా చూడాలని, చలువ పందళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని, ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. జాతర రోజుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్లు, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో భక్తులు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం జాతర కాలంలో అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం మన బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శివ రుద్రప్ప , ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య, గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, మండల తహసీల్దార్ విష్ణు సాగర్,మండల ఎంపీడీవో చంద్రశేఖర్,ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు,వైద్య మరియు నర్సింగ్ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, రమేష్ చౌహన్, బ్రహ్మానంద రెడ్డి, సంజీవ్, నరసింహ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News