Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

భువనగిరిలో ఒంటరి మహిళలతో సమావేశం – బొజ్జ సంధ్యా రెడ్డి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ హామీ

01-03-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 110 ఒంటరి మహిళల ఆవేదనలు – ఉపాధి, విద్య సహాయానికి మనంటీవీ ముందుకు

భువనగిరి టౌన్:యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణ కేంద్రంలోని ఎస్.వి కన్వెన్షన్ హాల్లో ఆదివారం రోజు ఒంటరి మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంధ్యా రెడ్డి ఆధ్వర్యంలో,మనంటీవీ సహకారంతో ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో సుమారు 110 మంది ఒంటరి మహిళలు పాల్గొని తమ సమస్యలను మనంటీవీ ప్రతినిధి మనోజ్‌కు వివరించారు. కుట్టు మిషన్ శిక్షణ పొందిన ఒంటరి మహిళలకు ఉపాధి కల్పన కోసం కుట్టు మిషన్లు అందించాలని వారు కోరారు.మదర్ ఫౌండేషన్ పరిధిలో ఉన్న ఒక మహిళ భర్త దివ్యాంగుడిగా ఉండటంతో, ముగ్గురు పిల్లలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలుసుకున్న సంధ్యా రెడ్డి ఆమెకు వెంటనే ఒక కుట్టు మిషన్ అందజేశారు. అదేవిధంగా,సమావేశానికి హాజరైన ప్రతి ఒంటరి మహిళకు జీవితంలో వెలుగు నింపేందుకు కుట్టు మిషన్లు అందించేందుకు కృషి చేస్తామని మనంటీవీ తరఫున హామీ ఇచ్చారు.

సమావేశంలో మహిళలు తమ ఆవేదనలను పంచుకున్నారు. పిల్లల చదువుల కోసం డబ్బుల కొరత, ఉపాధి అవకాశాల లేమి, ఆర్థిక స్తోమత లేకపోవడం వంటి అనేక సమస్యలు వ్యక్తం చేశారు. చదువుకున్న కొంతమంది మహిళలు ఉద్యోగాల కోసం విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి సమస్య బాధాకరమని పేర్కొంటూ వారికి మనోధైర్యం నింపారు సంధ్యా రెడ్డి.ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీల ద్వారా ఒంటరి మహిళలకు అవసరమైన సహాయం అందేలా చూడాలని ఆమె కోరారు. మదర్ ఫౌండేషన్ తరఫున సాధ్యమైనంత సహాయం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆర్డినేటర్లు పావని,శిరీష,జ్యోతి,వసంత,సాయిరాం,సావిత్రి,రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్, ఎండి కరీం, పుట్ట శివ,మనోహర్,హీరా కార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నా

Sthanikam

భువనగిరిలో ఒంటరి మహిళలతో సమావేశం – బొజ్జ సంధ్యా రెడ్డి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ హామీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News