Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:00 AM

భాల్కిలో ఘనంగా గురువుల స్మరణోత్సవాలు – ఎంపీ

22-04-2026 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రభావం కలిగిన పూజ్య డా. చెన్నబసవ పట్టదేవర 27వ స్మరణోత్సవం మరియు నాడోజ పూజ్య డా. బసవలింగ పట్టదేవర అమృత మహోత్సవం సందర్భంగా భాల్కి పట్టణంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్ హాజరై గురువుల సేవలను స్మరించారు.ఈ సందర్భంగా భాల్కికి వచ్చిన ఎంపీని అఖిల మహోజ్వల సమితి సభ్యులు ఘనంగా ఆహ్వానించి శాలువాతో సన్మానించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొని సమాజానికి మార్గదర్శకులైన గురువుల సేవలను గుర్తుచేసుకుంటూ వారికి నివాళులర్పించారు. వీరశైవ బసవేశ్వర జయంతి ఉత్సవాలు, బసవ జాత్ర సందర్భంగా జరిగిన కార్యక్రమాలు భక్తి వాతావరణంలో కొనసాగాయి.ఈ కార్యక్రమంలో అఖిల మహోజ్వల సమితి సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

భాల్కిలో ఘనంగా గురువుల స్మరణోత్సవాలు – ఎంపీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News