Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:05 AM

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ స్ఫూర్తితో ముందుకు సాగాలి:వై పండరి

23-03-2026 177 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కులం, మతం అనే భేదాలు లేకుండా స్వాతంత్ర్య ఫలాలు ప్రతి భారతీయుడికి సమానంగా దక్కాలని ఆకాంక్షించిన మహనీయ విప్లవ వీరులు భగత్ సింగ్, సుఖ్ దేవ్,రాజ్ గురు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం కేవలం 23 సంవత్సరాల వయసులోనే "ఇంక్విలాబ్ జిందాబాద్" నినాదాలతో బ్రిటీష్ పాలనకు సవాలు విసిరి, ప్రాణాలను త్యాగం చేసిన వారి సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి మాట్లాడుతూ,భగత్ సింగ్ మరియు ఆయన సహచరులు దేశ యువతకు ఆదర్శమూర్తులని, వారి ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకాలని తెలిపారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరుల త్యాగం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొఠారి నరసింహులు, మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు విశ్వనాథ్, అంబేద్కర్ పూలే సేవాసమితి డివిజన్ అధ్యక్షుడు ఎస్. నరసింహులు, రిటైర్డ్ జూనియర్ అసిస్టెంట్ పి. విట్టల్ తదితరులు పాల్గొన్నారు. వారు కలిసి భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల త్యాగాలను ఎప్పటికీ మరవకూడదని, వారి ఆత్మీయత, ధైర్యం, దేశభక్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Sthanikam

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ స్ఫూర్తితో ముందుకు సాగాలి:వై పండరి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News