Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:11 AM

భద్రత కోసం గ్రామంలో కమిటీ ఏర్పాటు – ప్రజల్లో అవగాహన

13-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలో తడ్కల్ గ్రామ రైతు వేదికలో సోమవారం “99 డేస్ యాక్షన్ ప్లాన్”లో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించగా, గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి “గ్రామ రోడ్డు భద్రత కమిటీ”ను ఏర్పాటు చేసి, సర్పంచ్‌తో పాటు మొత్తం పది మంది సభ్యులను నియమించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత యువకులతో కలిసి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించడంతో పాటు, చిన్నచిన్న నిర్లక్ష్యాల వల్ల జరిగే ప్రమాదాలను టీవీ స్క్రీన్ ద్వారా చూపించి ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమం అనంతరం గ్రామంలోని రోడ్డు గుంతలను పూడ్చడం, రహదారులకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించడం వంటి చర్యలు గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో చేపట్టి రహదారులను సురక్షితంగా మార్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భద్రత కోసం గ్రామంలో కమిటీ ఏర్పాటు – ప్రజల్లో అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News