Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:04 AM

బసవేశ్వరునికి ఘన నివాళులు అర్పించిన నిర్మల జగ్గారెడ్డి

20-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా సంగారెడ్డిలో వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా టీజీఐఐసి చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పట్టణంలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయం మరియు బైపాస్ రోడ్డులో ఉన్న బసవేశ్వర విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొనగా, అనంతరం బైపాస్ రోడ్డులో కూడా పూలమాలలు వేసి బసవేశ్వరుని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ “కాయకమే కైలాసం” అనే సూత్రంతో శ్రమకు గౌరవం తీసుకొచ్చిన మహాత్మా బసవేశ్వరుడు గొప్ప సామాజిక సంస్కర్త అని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు, కుల వివక్షలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన బోధనలు నేటికీ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని తెలిపారు. సమానత్వం, న్యాయం, మానవతా విలువలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, నాయకుడు కూన సంతోష్, కౌన్సిలర్లు వంశీ, హరిష్ తదితరులు పాల్గొనగా, పట్టణ ప్రజలు, నాయకులు, యువత అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Sthanikam

బసవేశ్వరునికి ఘన నివాళులు అర్పించిన నిర్మల జగ్గారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News