Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:08 AM

బాలల రక్షణ, మాదక ద్రవ్యాల నివారణపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

27-04-2026 123 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణలో భాగంగా బాలల సంక్షేమం, యువత అభివృద్ధి లక్ష్యంగా భరోసా, ఎ.హెచ్.టి.యు, షీ-టీమ్స్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 6 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలల రక్షణ, చైల్డ్ సేఫ్టీ, మానవ అక్రమ రవాణా నిరోధం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత స్థాయిలో చైతన్యం కల్పించాలని సూచించారు. పిల్లలు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. బాలలపై నేరాల నిరోధంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, ఎ.హెచ్.టి.యు ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, షీ-టీమ్ ఎస్ఐ పూలభాయ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాలల రక్షణ, మాదక ద్రవ్యాల నివారణపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

Article Image

“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యచరణలో భాగంగా బాలల సంక్షేమం, యువత అభివృద్ధి లక్ష్యంగా భరోసా, ఎ.హెచ్.టి.యు, షీ-టీమ్స్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 6 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలల రక్షణ, చైల్డ్ సేఫ్టీ, మానవ అక్రమ రవాణా నిరోధం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత స్థాయిలో చైతన్యం కల్పించాలని సూచించారు. పిల్లలు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. బాలలపై నేరాల నిరోధంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, ఎ.హెచ్.టి.యు ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, షీ-టీమ్ ఎస్ఐ పూలభాయ్, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News