Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 08:47 PM

బీసీ కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం.. 

21-05-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

సామాజిక న్యాయానికి బలమైన పునాది..

కేంద్ర ప్రభుత్వం తక్షణమే కులగణన చేపట్టాలి..

బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

కట్టెకోలు దీపెందర్.. డిమాండ్..

నల్లగొండ : బీసీ కులగణనపై సుప్రీంకోర్టులోని జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడాన్ని సామాజిక న్యాయ విజయంగా ఆయన అభివర్ణించారు. వెనుకబడిన వర్గాల అసలు జనాభా, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం అభినందనీయమన్నారు. దేశ నిర్మాణంలో బీసీలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ సరైన గణాంకాలు లేకపోవడం వల్ల విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని దీపెందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల సమాన పంపిణీకి ఖచ్చితమైన కులగణన అవసరమని కోర్టు అభిప్రాయపడటం ద్వారా బీసీల దీర్ఘకాలిక డిమాండ్‌కు న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పారదర్శకమైన, శాస్త్రీయ విధానంలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు విశ్వనాధుల శివకుమార్, నిరుద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పాల్వాయి రవి, నాయకులు కొడదల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీ కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం.. 

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News