Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:16 AM

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం

02-03-2026 277 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో వట్ పల్లి మండల పరిధిలోని మర్వెల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, జిల్లా స్థాయి అధికారుల పాత్రలను స్వీకరించి ఒక రోజు పాటు బాధ్యతలను నిర్వహించారు.భార్గవి ప్రధానోపాధ్యాయురాలిగా వ్యవహరించగా, ఆర్మాన్ జిల్లా విద్యాధికారిగా, జ్యోతిక మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అక్షిత జిల్లా కలెక్టర్ పాత్రను నిర్వర్తించగా, కౌశిక్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. అలాగే మనీషా, రేణుక, వర్ష, సంకీర్తన, శ్రీరామ్, విశ్వతేజ, లక్షిత్, నితిన్, మనోహర్, మల్లేష్ ఉపాధ్యాయులుగా తరగతులు నిర్వహించి పాఠాలు బోధించారు. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాభావాన్ని ప్రదర్శించారు.కార్యక్రమం అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఉపాధ్యాయులు రితిన్ రెడ్డి, సంగయ్య, రవీందర్ పాల్గొన్నారు.స్వయంపాలన దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు సమాజంలో బాధ్యతాయుత వ్యక్తులుగా ఎదగడానికి అవసరమైన అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Sthanikam

బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే సంకల్పంతో స్వయంపాలన దినోత్సవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News