Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:09 AM

ఆయిల్ పామ్ సాగు లక్ష్య సాధనకు కృషి చేయాలి

25-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్

సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని పూర్తిగా సాధించేందుకు అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో, చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. జిల్లాకు ఈ ఏడాది 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించగా,ఇప్పటికే 1,850 ఎకరాల్లో సాగు జరిగినట్లు తెలిపారు.మిగిలిన లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకు లక్ష్యానికి మించి విస్తీర్ణంలో సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన,సెరికల్చర్ శాఖల అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలతో ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, వరికి ప్రత్యామ్నాయంగా లాభదాయకమైన పంటగా రైతులు దీనిని స్వీకరించేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ఆర్థిక లాభాలను రైతులకు అర్థమయ్యే విధంగా వివరించాలని తెలిపారు.అదేవిధంగా జిల్లాలో యూరియా ఎరువులకు ఎలాంటి కొరత లేదని, సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, రైతు బీమా సంబంధిత అంశాలను త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సోమేశ్వర్, గోద్రెజ్ సంస్థ జనరల్ మేనేజర్ స్వీటీ, ఉద్యానవన మరియు వ్యవసాయ శాఖల అధికారులు, ఏ.డి.ఏలు, ఏ.ఈ.ఓలు పాల్గొన్నారు.

Sthanikam

ఆయిల్ పామ్ సాగు లక్ష్య సాధనకు కృషి చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News